ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో రీసర్వేకు ఎంపికైన (70) గ్రామాలలో సర్వే కొనసాగుతుందని, పకడ్బందీగా సర్వేలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డిస్టిక్ కలెక్టర్ స్నేహ శబరిష్, బుధవారం జిల్లాలోని తొర్రూరు మండల కేంద్రంలో రీ సర్వేకు ఎంపికైన జమిస్తాన్పురం, కానాపురం, వెంకటాపురం, కర్కాల, గోపాలగిరి, మడిపల్లి ( 6) గ్రామాలలో ఈరోజు జమస్తాన్పూర్ లో జరుగుతున్న రీసర్వేలు కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు గ్రామంలో (190) ఎకరాల పట్టా భూములను సర్వే చేయడం జరిగిందని, జులై 10 నుండి సర్వే కొనసాగుతుందని, లక్ష్యం లోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం తొర్రూరు తహసిల్దార్ కార్యాలయంలో 22ఎ, పై నిషేధిత జాబితాలో వ్యవసాయతర భూముల ను సక్రమంగా గుర్తించాలని, భూ సమస్యలకు సంబంధించి రికార్డులలో ఎక్కడైనా వ్యవసాయ తర భూముల ప్రభుత్వ కార్యాలయాలు స్కూలు సబ్ స్టేషన్ తదితర అంశాలపై ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వ సూచించిన ప్రకారం 22 ఏ, ను పకడ్బందీగా అమలు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యాలయ పరిధిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలను అందించాలని సూచించారు.
ఈ పర్యటనలు కలెక్టర్ వెంట రెవెన్యూ డివిజనల్ అధికారి గణేష్, ల్యాండ్ రికార్డ్స్ ఏ డి శ్రీనివాస్, తహసిల్దార్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.