వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు నల్లబెల్లి గ్రామానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు ఆదివారం ఉదయం సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయనిధి) చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడి వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్న తోపుచర్ల దేవేందర్ రావు రూ.60,000, పలపాటి కమలాకర్ రావు రూ.52,000, జన్నపురెడ్డి మాధవ రెడ్డి రూ.20,000, మల్యాల శ్రావ్య రూ.45,000 మొత్తం రూ.1,77,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా నాయకులు బిర్రు రాజు, నల్లబెల్లి కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు తాటికాయల దిలీప్, జిల్లా నాయకులు జక్కి గోపాల్, గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యం యాకన్న, వార్డు మెంబర్లు మరుపట్ల ప్రశాంత్, ఎలాబోయిన సదానందం, ఆరెల్లి నాగరాజు, బిర్రు సురేందర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బిర్రు భాస్కర్, దుగ్యాల దేవేందర్ రావు, బోల్లపెల్లి కుమార్, జన్నపరెడ్డి సంపత్ రెడ్డి, బోల్లపెల్లి యాకాంబరం, వడ్డే నారాయణ, బిర్రు పెద్ద యాకయ్య, బిర్రు మధు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.