కుడా పరిధిలో చే పట్టిన వివిధ అభివృద్ధి పనులు వేగవంతం కావాలని కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్, కుడా వైస్ చైర్ పర్సన్ చాహత్ బాజ్ పాయి అన్నారు. మంగళవారం కుడా కార్యాలయం లో అభివృద్ధి పనుల పురోగతి మీద సంబంధిత అధికారులతో కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్, కుడా వైస్ చైర్ పర్సన్ చాహత్ బాజ్ పాయి రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... కుడా పరిధిలో చేపట్టిన వరంగల్ బస్ స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, వేయి స్తంభాల గుడి అభివృద్ధి పనులు, ఉనికి చర్ల, హన్మకొండ చౌరస్తా రీ డెవలప్మెంట్ , ఔటర్ రింగ్ రోడ్, NH గ్రీనరి మొదలగు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. భూ సేకరణ చేయాలిసి ఉన్న అభివృద్ధి పనులకు సంబందించిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ఈ సమావేశం లో కుడా పి ఓ అజిత్ రెడ్డి, ఈ ఈ భీమ్ రావు తదితరులు పాల్గొన్నారు