నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లిలోని గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఐఏఎస్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు.
గిరిజన బాలికల కళాశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
విద్యా బోధనపై ఆరా
కలెక్టర్ తరగతి గదులను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న అంశాలపై విద్యార్థినులను ప్రశ్నించి, వారి అభ్యసన సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. నాణ్యమైన విద్య అందించడంతో పాటు, ప్రతి విద్యార్థిని ప్రతిభపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు.
వసతులు, భోజనం పరిశీలన..
కళాశాలలో విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలను, వంటగదిని, సరుకుల నిల్వ గదిని పరిశీలించారు. పప్పుదినుసులు, కూరగాయల నాణ్యతను చెక్ చేశారు. ప్రభుత్వ మెనూ ప్రకారమే నాణ్యమైన భోజనం అందించాలని వార్డెన్ ను ఆదేశించారు. అనంతరం తయారు చేసిన ఆహారాన్ని పరిశీలించి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.
ఆరోగ్యం పై దృష్టి
విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఏఎన్ఎం వద్ద ఉన్న మందుల నిల్వను పరిశీలించి, నాణ్యమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
పాల్గొన్న అధికారులు:
ఈ పర్యటనలో డిటిడబ్ల్యుఓ నారాయణ రెడ్డి, డిబిసిడబ్ల్యుఓ పుష్పలత, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్ రావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.