నిజామాబాద్/ మోపాల్(రైట్స్ మీడియా): నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలోని వారంతా పదేళ్ళ లోపు చిన్నారులు కానీ వారి ఆలోచనలకు పదును పెడుతూ ప్రతి సంవత్సరం పర్యావరణ కాలుష్యం జరుగకుండా సహజసిద్ధమైన రంగులతో విఘ్నాలను తొలగించే విజ్ఞా మహారాజు, ఆది వినాయకుడిని తీర్చిదిద్దుతు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది మామూలు ముగ్గు పౌడర్ తో గణనాథుడిని తీర్చి పూజలు నిర్వహించారు..ఈ ఏడాది జెడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్ లో యోగా బృందం ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకోని పాఠశాల ఆవరణలో ఇసుక, కంకర రాళ్లతో ప్రకృతి గణనాథుడిని తీర్చి దిద్ది ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆ గణనాధుని చుట్టూ మొలకెత్తిన వరి నారును నాటారు.
పచ్చని ప్రకృతి గణనాథుడిని తీర్చిదిద్ది, పూజలు నిర్వహిస్తున్న చిన్నారులు...
⏩పెద్దల ప్రోత్సాహంతో ఆధ్యాత్మిక శోభతో పాటు పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని చాటుతున్న చిన్నారులు.
⏩ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేస్తున్న ఉత్తమ గణనాధుల ఏర్పాటులో గుర్తింపు దక్కదా ?? లక్షలు ఖర్చుపెట్టి ఎత్తైన భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్న పెద్దలకే గుర్తింపా అంటున్న ప్రజలు...
ఆధ్యాత్మిక శోభతో పాటు పర్యావరణ పరిరక్షణ సందేశం:
ప్రతిరోజూ నీరు పోయడంతో వరి నారు ఏపుగా పెరిగి ఆధ్యాత్మిక శోభతో పాటు పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని చాటుతోంది. ప్రకృతి సిద్ధంగా రూపొందించిన ఈ గణనాథుడిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులతో పాటు చుట్టు పక్కల గ్రామాల భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. యోగా బృందం సభ్యులు నిత్యం ప్రకృతి గణనాథుడికి పూజలు నిర్వహిస్తున్నారు.. అయితే గణనాధుని ఏర్పాటుకు పెద్దలు సలహా ఇస్తే చిన్నారులు ప్రతి ఏటా చెయ్యడం గర్వించదగ్గ విషయమంటున్నారు. అలాగే నిమజ్జన కార్యక్రమం సైతం వినాయక ప్రతిమలో పెరిగిన వరి నారు ను రైతులకు తమ పొలాల్లో వేసుకునేందుకు అందించడం జరుగుతుందని, వినాయక ప్రతిమ లో ఉన్న కుంకుమ, పసుపు, పూలదండలు, అమర్చిన రాళ్లు పొలాల్లో ఉంచడం జరుగుతుందన్నారు.. దీనివల్ల ఆది వినాయకుని ఆశీస్సులతో పంట పొలాలు సమృద్ధిగా పెరుగుతాయని నిర్వాహకులు పేర్కొంటున్నారు. వినాయక చవితి అంటేనే పిల్లలు,పెద్దలు ప్రతి ఒక్కరు చందాలు చేసుకొని రంగు రంగుల,ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో విభిన్న ఆకృతులలో ప్రతిమలను లక్షలు ఖర్చుపెట్టి భారీ ఎత్తయిన విగ్రహాలను కొనుగోలు చేసి వేలాది రూపాయలు వెచ్చించి, అందంగా డెకరేషన్ తో ముస్తాబు చేసి డీజే బాక్సులు పెట్టీ నృత్యాలతో 11 రోజులపాటు ఎంతో సంతోషంగా పూజలు చేసుకుంటూ హంగామా చేస్తుంటారు. అనంతరం వినాయక నిమజ్జనం నిర్వహిస్తారు. దీనివలన పర్యావరణ కాలుష్యం జరుగుతుందనే విషయం తెలిసిందే. కానీ అందుకు భిన్నంగా చిన్నారులు పెద్దల సలహా మేరకు పర్యావరణ పరిరక్షణతో ఎలాంటి ఎక్కువ ఖర్చు లేకుండా హంగు ఆర్భాటం లేకుండా పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్రకృతిని కాపాడే దిశగా పచ్చని ప్రకృతి గణనాథుడిని తీర్చి పూజలు నిర్వహిస్తున్న చిన్నారులను అందరూ అభినందిస్తున్న గుర్తింపు రాక పొవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు... ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేస్తున్న ఉత్తమ గణనాధుల ఏర్పాటులో చిన్నారులకు చోటు దక్కదా, కనీస ప్రోత్సాహం సైతం ఉండదా? అని అంటున్నారు. లక్షలు ఖర్చుపెట్టి ఎత్తైన భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్న పెద్దలకే గుర్తింపు ఇచ్చి ఉత్తమ గణనాధుల అవార్డులను, ప్రోత్సాహకాలను అందిస్తారా? అని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.
ప్రకృతి గణనాధుడిని ఏర్పాటు చేసిన యోగా బృందం:
మోపాల్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో యోగా బృందం సభ్యులు నవీన్ రెడ్డి, చిన్నారెడ్డి,గంగాధర్, ముత్యం, గంగమల్లు శేఖర్, సాయిలు జీవన్, సలహాలతో అక్షర,దీక్షిత్ ,ఆకృతి, యశ్వంత్, హరిణి,సహస్ర,నితీష్, అద్వైత్ అన్వేష్ సన్నీ అభిరామ్ చిన్నారులు ఆధ్వర్యంలో ప్రకృతి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో ఇసుక, కంకర రాళ్లతో గణేశుడి ఆకృతిని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం చుట్టూ మొలకెత్తిన వరి నారును నాటారు.
ప్రతిరోజూ నీరు పోయడంతో వరి నారు ఏపుగా పెరిగి ఆధ్యాత్మిక శోభతో పాటు పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని చాటుతోంది. ప్రకృతి సిద్ధంగా రూపొందించిన ఈ గణనాథుడు విద్యార్థులు, ఉపాధ్యాయులు, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. యోగా బృందం సభ్యులు, చిన్నారులు అక్షర,దీక్షిత్ ,ఆకృతి, యశ్వంత్, హరిణి,సహస్ర, నితీష్, అద్వైత్ అన్వేష్ ,సన్నీ అభిరామ్ నిత్యం ప్రకృతి గణనాథుడికి పూజలు నిర్వహిస్తున్నారు.