హనుమకొండ(రైట్స్ మీడియా): “బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల పండుగ. ప్రకృతితో మమేకమై, సంప్రదాయాలను చాటిచెప్పే ఈ పండుగలో యావత్తు కుటుంబం, సమాజం భాగస్వాములవుతాయి” అని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయ మహిళా బోధనా, బోధనేతర ఉద్యోగుల ఆధ్వర్యంలో బుధవారం (14వ తేదీ) పరిపాలనా భవన ప్రాంగణంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలను ఆయన ప్రారంభించారు.
“తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ” – కేయూలో ఘనంగా సంబరాలు
- వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి.
ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ,
ప్రకృతిలో లభించే పూలను సేకరించి, వాటితో బతుకమ్మను అలంకరించి తిరిగి ప్రకృతికే సమర్పించడం ఈ పండుగ ప్రత్యేకత అన్నారు. వివిధ ప్రాంతాల్లో నివసించే ఆడపడుచులు తమ స్వస్థలాలకు చేరుకుని కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి పండుగ జరుపుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు.
పాలకమండలి సభ్యురాలు డాక్టర్ రమ మాట్లాడుతూ, ప్రకృతిలో కాలానుగుణంగా వచ్చే మార్పులను స్వాగతిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారని అన్నారు.
మరో పాలకమండలి సభ్యురాలు కే. అనితా రెడ్డి మాట్లాడుతూ, బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల పండుగగా, ప్రజలందరినీ ఐక్యం చేసే సాంస్కృతిక వేడుకగా నిలుస్తుందని, ఔషద గుణాలు కలిగిన పూలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు ఆచార్య సురేష్ లాల్, డాక్టర్ ఎన్. సుదర్శన్, డాక్టర్ చిర్రా రాజు, అధికారుల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ ఎస్. సుజాత, నాన్ టీచింగ్ మహిళా ఉద్యోగుల ప్రతినిధి బి. కృష్ణవేణి, నాలుగో తరగతి మహిళా ఉద్యోగుల ప్రతినిధి జి. మల్లికాంబ, డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ ముకుందా రెడ్డి, పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు, బోధనా, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, పూజలు నిర్వహించి, బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు.