ఈ-ఫైల్స్ క్లియరెన్స్లో మంత్రి అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ-ఫైళ్ల పరిష్కారంలో వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలిచి తన పనితీరును చాటుకున్నారు. అత్యంత వేగంతో పాటు పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యత ఇస్తూ ఫైళ్లను పరిష్కరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు.
ప్రభుత్వ పరిపాలనలో జాప్యాన్ని తగ్గిస్తూ, నిర్ణయాలను వేగంగా తీసుకోవడంలో ఈ-ఫైలింగ్ వ్యవస్థను మంత్రి అచ్చెన్నాయుడు సమర్థవంతంగా వినియోగిస్తున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఫైళ్ల పరిష్కారంలో వేగంతో పాటు స్పష్టత, పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు.
గంటల వ్యవధిలోనే ఫైళ్లను పరిశీలించి పరిష్కరించడం ద్వారా మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేకతను చాటుతున్నారని సీఎం కొనియాడారు. ఈ-ఫైల్స్ క్లియరెన్స్ లో వరుసగా మూడోసారి మొదటి స్థానాన్ని సాధించడం ఆయన పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. పారదర్శకత, వేగం, సమర్థతకు పెద్దపీట వేస్తూ మంత్రి అచ్చెన్నాయుడు కొనసాగిస్తున్న పనితీరు ఇతర శాఖలకు కూడా ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఈ-ఫైల్స్ క్లియరెన్స్లో అచ్చెన్నాయుడి సరికొత్త రికార్డు
మంత్రి అచ్చెన్నాయుడిని అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.