హనుమకొండ (రైట్స్ మీడియా): జిల్లాలో బతుకమ్మ, దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తిచేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ఈ నెల 10వ తేదీ నుండి 21 వరకు జరగనున్న బతుకమ్మ, దసరా ఉత్సవాలకు సంబందించి వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే ఏర్పాట్లపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, దేవాదాయ, ఇతర శాఖల అధికారులతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సమీక్షించారు.