దేశవ్యాప్తంగా సంచలం సృష్టించిన బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్లోని కోట, మ్యాగజైన్ నుంచి తుపాకులు, మందుగుండు సామగ్రి చోరీ చేసిన కేసులో రిటైర్డ్ ఆర్మీ హవల్దార్ ఉప్పుతొల్ల మల్లేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బొల్లారం పోలీసులు, హైదరాబాద్ టాస్క్ఫోర్స్, ఎస్ఓటీ మల్కాజ్గిరి సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు పదవీ విరమణపై అసంతృప్తితోనే చోరీకి పాల్పడినట్లు సమాచారం.
దాదాపు పదహారు ఏళ్ల పాటు మద్రాస్ రెజిమెంట్ లో పనిచేసిన మల్లేష్ ఈ ఏడాది జూన్ మాసంలో ముందస్తు పదవీ విరమణ కావడంతో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. ఘటనకు వేరే కారణాలున్నాయా అనే కోణంలో కుడా దర్యప్తు కొనసాగుతోంది.

ఆగస్టు నెల 30/31 రాత్రి మల్లేష్ ఒక ఏకే రైఫిల్, ఒక ఎన్సాస్ రైఫిల్, మూడు పిస్టల్లు, నైట్ విజన్ కళ్లజోడు, బుల్లెట్లు లను బోల్లారం మద్రాస్ రెజిమెంట్ లో అయుధాగారం నుంచి దొంగిలించి పారిపోయాడు. నిందితుడి స్వస్థలం నాగర్ కర్నూలు. దొంగిలించిన అయుధాలను కౌకూరు, యాప్రాల్, నాగర్ కర్నూలు లో దాచిపెట్టాడు. బోల్లారం పోలీసులు, హైదరాబాద్ టాస్క్ ఫోర్సు, మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపారు.