Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

నూతన క్రిమినల్ చట్టాలపై సాయుధ దళాల సిబ్బందికి శిక్షణ

• సాయుధ బలగాల సిబ్బందికి నూతన క్రిమినల్ చట్టాల పట్ల అవగాహన కల్పించుటకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐ.పి.ఎస్. కార్యాచరణ

నూతన క్రిమినల్ చట్టాలపై సాయుధ దళాల సిబ్బందికి శిక్షణ
Share Short Clip Download PDF

• సాయుధ బలగాల సిబ్బందికి నూతన క్రిమినల్ చట్టాల పట్ల అవగాహన కల్పించుటకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐ.పి.ఎస్. కార్యాచరణ

హనుమకొండ (రైట్స్ మీడియా): తెలంగాణ రాష్ట్ర డిజిపి సి.వి. ఆనంద్ సూచన మేరకు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని సాయుధ బలగాల సిబ్బందికి నూతన క్రిమినల్ చట్టాల పట్ల అవగాహన కల్పించుటకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐ.పి.ఎస్. కార్యాచరణ చేపట్టారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సాయుధ బలగాల విబాగంలో కానిస్టేబుల్ నుండి కమాండెంట్ వరకు గల మొత్తం 971 సిబ్బందిని 20 బ్యాచ్ లు గా విభజించి, రోజుకు ఒక బ్యాచ్ చొప్పున మడికొండ లోని కమిషనరేట్ పోలీస్ శిక్షణ కేంద్రం లో శిక్షణ ఇచ్చుటకు కు ప్రణాళికా రూపొందించారు.

అందులో భాగంగా శనివారం రోజున మొదటి బ్యాచ్ కి పోలీస్ శిక్షణ కేంద్రం వైస్ ప్రిన్సిపల్, ఎసిపి రమణబాబు పర్యవేక్షణలో శిక్షణనిచ్చారు.

నూతన క్రిమినల్ చట్టాలపై సాయుధ దళాల సిబ్బందికి శిక్షణ

ఈ సందర్బంగా సిబ్బందికి నూతన చట్టాల పైన అవగాహన, ఎఫ్ఐఆర్ నమోదు, అరెస్టు సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, నేర స్థలంలో సాక్షాదారాల సేకరణ, ధర్నాల నిర్వహణ, ముందస్తు అరెస్టులు, నేరాల విభజన, మహిళలపై జరిగే నేరాలు, టెర్రరిస్టు చట్టాలు, సైబర్ నేరాలు, నేర విచారణలో పోలీసులకు ఉన్న అధికారాలు మొదలగు అంశాల పట్ల శిక్షణనిచ్చారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ లా శిక్షకులు ఇన్స్పెక్టర్ సూర్యప్రకాశ్, సహాయక లా శిక్షకులు సబ్-ఇన్స్పెక్టర్ లు విజయ్, దేవేందర్, ఆర్ఐ ఉదయబాస్కర్, ఆర్ ఎస్సై రమేష్, శిక్షణ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

నూతన క్రిమినల్ చట్టాలపై సాయుధ దళాల సిబ్బందికి శిక్షణ

Source / reference: Journalist Ch. Ramesh, Hanumakonda District, Telangana state.