Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వార్షిక తనిఖీలు

⏩ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిరంతర నిఘా వ్యవస్థల వినియోగంపై ప్రత్యేక దృష్టి

హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వార్షిక తనిఖీలు
Share Short Clip Download PDF

⏩ సిబ్బంది పనితీరు, స్టేషన్ నిర్వహణపై కీలక సూచనలు

⏩ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలందించడమే లక్ష్యంగా సమగ్ర సమీక్ష

పోలీసింగ్ వ్యవస్థ మరింత పటిష్టం కావాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం దిశానిర్దేశం..

కరీంనగర్/హుజూరాబాద్ (రైట్స్ మీడియా): హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం సందర్శించారు. స్టేషన్‌కు విచ్చేసిన కమిషనర్‌కు హుజూరాబాద్ ఏసీపీ మాధవి, ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ పూలమొక్కను అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం సాయుధ బలగాల గౌరవ వందనాన్ని సీపీ స్వీకరించారు.

వార్షిక తనిఖీల్లో భాగంగా స్టేషన్‌లోని పలు విభాగాలను, రికార్డులను కమిషనర్ సమగ్రంగా పరిశీలించారు. సిబ్బంది, వారి విధులు, క్షేత్రస్థాయి పనితీరును అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో మరింత పారదర్శకత, వేగం పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, కేస్ ప్రాపర్టీ భద్రత, రికార్డుల క్రమబద్ధీకరణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని పేర్కొంటూ, స్టేషన్‌ పరిధిలోని అన్ని నిఘా కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. అలాగే పెట్రోలింగ్ వాహనాలు, ఆధునిక పరికరాలను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఉపయోగంలో లేని పాత సామాగ్రిని కమిషనరేట్‌కు తరలించి స్టేషన్ ప్రాంగణాన్ని మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.

హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వార్షిక తనిఖీలు

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం అందిస్తూ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఏసీపీ మాధవి, ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, ఎస్సైలు మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వార్షిక తనిఖీలు

Source / reference: Journalist Panjala Thirupathi, Huzurabad, Karimnagar.