పాలకుర్తి(రైట్స్ మీడియా): మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దవంగర మండలం ఉప్పరిగూడెం గ్రామానికి చెందిన సౌమ్య కి అనారోగ్య రీత్యా అత్యవసర చికిత్స నిమిత్తం రూ.2 లక్షల LOC (Letter of Credit)ని పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి మంజూరు చేయించి, మంగళవారం అందజేశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న సౌమ్యకు రూ.2 లక్షల LOC మంజూరు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ..
అనారోగ్యంతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర వైద్య చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యం అందక ఎవరూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని, సౌమ్య త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.