తన తండ్రి జ్ఞాపకార్థం పాఠశాల విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వర్ధన్నపేట మండల పరిధిలోని రామోజీ కుమార్ గూడెం తండా ఉపసర్పంచ్ భూక్యా తిరుపతి నాయక్ తన తండ్రి భూక్య సూర్య నాయక్ జ్ఞాపకార్థం విద్యార్థులకు స్పోర్ట్స్‌ డ్రెస్‌లను పంపిణీ చేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామంలోని స్థానిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు క్రీడా దుస్తులను అందజేశారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మాట్లాడుతూ తన తండ్రి సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ విద్యార్థుల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ సుశీల శంకర్ నాయక్, గ్రామస్తులు ఉపసర్పంచ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.