Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
తెలంగాణ

బలమైన ప్రజాస్వామిక భారతదేశ నిర్మాణమే సమరయోధుల త్యాగాలకు నిజమైన నివాళి

--ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.

బలమైన ప్రజాస్వామిక భారతదేశ నిర్మాణమే సమరయోధుల త్యాగాలకు నిజమైన నివాళి
Share Short Clip Download PDF

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ దేశంలోని ప్రతి పౌరుడి జీవితంలో నూతన ఉత్సాహం, చైతన్యం నింపి అభివృద్ధి చెందిన భారత దేశ నిర్మాణానికి కొత్త ఊపునివ్వాలని అభిలషించారు.

దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ, పరస్పర గౌరవం, దేశభక్తి విలువలను పెంపొందిస్తూ అసమానతలు లేని శాంతి, సౌభ్రాతృత్వాలతో బలమైన ప్రజాస్వామిక భారతదేశ నిర్మాణమే సమరయోధుల త్యాగాలకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

బలమైన ప్రజాస్వామిక భారతదేశ నిర్మాణమే సమరయోధుల త్యాగాలకు నిజమైన నివాళి

పౌరులందరికీ సమన్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వంతో 80వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ఈ శుభసందర్భంగా నవ భారత నిర్మాణం కోసం ప్రతి పౌరుడు కర్తవ్యనిష్టతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.