Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
తెలంగాణ

ఇచ్చిన వాగ్ధానాన్ని నెరెవేర్చాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఇచ్చిన వాగ్ధానాన్ని నెరెవేర్చాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Share Short Clip Download PDF

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడ ఆ భూ సమస్యను చెప్పుకోవడానికి పోతే వినే నాధుడు లేడు.. భూమి ఉన్నప్పటికీ కొడుకు చదువు కోసమో, బిడ్డ పెండ్లి కోసమో, ఆరోగ్య అవసరాలకోసమో అమ్ముకునే అవకాశం లేనప్పుడు ఆ కుటుంబం పడే బాధ వర్ణనాతీతమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
రైతుకు భూమి హక్కు ఉంటేనే ఆర్థిక భరోసా.. భూమికి చట్టబద్ధమైన హక్కు ఉంటేనే రైతుకు సంపూర్ణ ధైర్యం, ఆర్థిక భద్రత లభిస్తుంది. అవకాశం ఉండి, అధికారం ఉండి, న్యాయం అయిన సమస్యను సొంత రాష్ట్రంలో కూడ దశాబ్ద కాలంగా తీర్చలేని అసమర్థులను ఏమంటారో ఈరోజు నూతన కల్, మద్దిరాల రైతుల ఆవేదనలో చూశానని మంత్రి అన్నారు.
శనివారం రోజు సూర్యాపేట జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి నూతన్కల్ & మద్దిరాల మండలాలలోని 15 గ్రామాలలో దశాబ్దాలుగా వస్తున్న భూసమస్యను తీర్చి, దాదాపు 1061 ఎకరాల భూమిని, 1044 మంది రైతులకు క్లియర్ చేసి పట్టాదారు పాసుబుక్కులు మంత్రి పొంగులెటి పంపిణీ చేసారు.

మంత్రి మాట్లాడుతూ..

గతంలో తుంగతుర్తి నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఈ భూసమస్యను స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్, రైతులు నాదగ్గరికి తీసుకువచ్చారు. దశాబ్దాల కాలం మరియు ప్రత్యేక రాష్ట్రంలో కూడ వారికి న్యాయం జరగలేదని న్యాయ బద్ధంగా కొన్న భూమి తమ అవసరాల కోసం ఉపయోగపడకుండా పోతుంది, కష్టాల్లో ఆదుకునే ఆస్తి కష్టాలను తెచ్చిపెడుతుందిని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు వారికి సమస్యను ఖచ్చితంగా తీర్చిపెడ్తానని, స్వయంగా నేనే వచ్చి పట్టాలిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. వారికి ఇచ్చిన హామీ మేరకు భూభారతిలో భాగంగా అధికార యంత్రాంగంతో సమగ్రంగా సర్వే చేపించి, సమస్యను అధిగమించి ఈ రోజు ఆ రైతులకు అధికారికంగా పట్టా పాసుబుక్కులు ఇవ్వడం జరిగిందని అన్నారు.
ఆ రైతుల కళ్లల్లో ఆనందం చూసినప్పుడు ఒక విషయం అనిపించింది. మనం చేసే పని బట్టే ప్రజలు మనల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు అని. అధికారం ఉండటం గొప్పతనం కాదు.. ఆ అధికారాన్ని సామాన్యుల సమస్యలు తీర్చేందుకు, వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో ఉపయోగించడమే అసలైన గొప్పతనం.
ప్రజల కష్టాలను అర్థం చేసుకుని.. వారికి అండగా నిలబడి.. వారి సమస్యలకు పరిష్కారం చూపినప్పుడే మన బాధ్యతకు నిజమైన అర్థం ఉంటుంది. ఈ సందర్భంగా గతంలో జెన్నారెడ్డి కుటుంబం దగ్గర పేద రైతులు కొనుకున్న భూమి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లోబడి సమస్యగా మారినప్పుడు..సమస్యను పరిష్కరించడంలో చొరవ చూపినందుకు జెన్నారెడ్డి సుధీర్ రెడ్డి కుమారుడు జెన్నారెడ్డి వివేక్ రెడ్డి ని రైతుల పక్షాన, ప్రభుత్వం పక్షాన సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిరు, స్థానిక శాసన సభ్యులు మందుల సామేల్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతులు, భూయజమానులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.