ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లతో పేదవాడి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ వారికి సొంతింటి కలను నెరవేరుస్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. బుధవారం రోజున హుజురాబాద్ మండలం జూపాక గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుని నూతన గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబోయే రోజుల్లో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, మండల అధ్యక్షుడు కిరణ్, ప్రజా ప్రతినిధులు, జూపాక గ్రామ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
'ఇందిరమ్మ ఇల్లు' గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరైన వొడితల ప్రణవ్..