కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పిఎం - ఈ-బస్ సేవా పథకం కింద వరంగల్ నగరానికి మంజూరైన ఎలక్ట్రిక్ బస్సుల ఏర్పాటుకు సంబంధించి చేపడుతున్న చర్యలు, పనుల పురోగతి, అవసరమైన మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై మంగళవారం కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ (MoHUA) అండర్ సెక్రటరీ కృష్ణ కుమార్ యాదవ్ న్యూ డిల్లీ నుండి మంగళ వారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించి సమీక్షించారు.
నగరం నుండి బల్దియా కమిషనర్ టి.వెంకన్న ఇంజనీరింగ్ అధికారులు సంయుక్తం గా ఇట్టి వర్చువల్ సమావేశం లో పాల్గొనగా నగరం లో పథకం అమలు చేస్తున్న తీరును కమిషనర్ వివరించారు.
పిఎం - ఈ-బస్ సేవా పథకం అమలవుతున్న వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎంపికైన నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సుల ఏర్పాటుకు సంబంధించిన పురోగతిని సమీక్షించారు.
జీ డబ్ల్యూ ఎం సి తరపున క్యాంప్ కార్యాలయం నుంచి కమిషనర్ వెంకన్న వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని, వరంగల్ నగరానికి మంజూరైన 100 ఎలక్ట్రిక్ బస్సుల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, పురోగతిని వివరించారు. బస్సుల నిర్వహణకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు, మౌలిక వసతుల కల్పన, సంబంధిత విభాగాలతో సమన్వయం తదితర అంశాలపై తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తదుపరి చర్యలను వేగవంతం చేయనున్నట్లు ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్‌కుమార్, సిపి రవీందర్ రాడేకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాధవీలత, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.