బండ్లగూడ ఆర్టీవో కార్యాలయంలో ఒక వీడియో కలకలం రేపింది. ఆర్టీవో కార్యాలయంలో ముడుపుల భాగోతాన్ని బట్టబయలు చేసింది. భారీగా నగదు లెక్కిస్తున్న ఒక కానిస్టేబుల్ వీడియో వైరల్ అయింది. అన్ని డాక్యుమెంట్లు ఉన్న వాహనదారులను తిప్పుతున్న వైనం ఇక్కడ సాధారణమే!. మధ్యవర్తుల ద్వారా వెళ్తేనే వేగంగా పనులు జరుగుతాయిఅనే ఆరోపణలు ఉన్నాయి. నగదు ఎవరిదనే దానిపై సమాధానం రావడంలేదు. బాధితులే స్వయంగా వీడియోలు తీసి పోస్ట్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.