భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన జరిగింది. కారు లాక్ అవ్వడంతో ఊపిరాడక నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. జూలూరుపాడు మండలం లోని ఓ గ్రామానికి చెందిన దంపతుల కూతురు(4) ఆదివారం స్కూలుకు సెలవు కావడంతో, ఇంటి వద్ద ఆడుకుంటూ లాక్ చేయని కారులో ఎక్కింది. కారు ఎక్కగానే కారు లాక్ అవ్వడంతో, కాసేపటికి ఊపిరాడక ఆ చిన్నారి స్పృహ తప్పింది. కాసేపటికి కూతురు కనిపించడంలేదని తల్లి చెప్పడంతో ఊరంతా వెతికి, అనుమానంతో కారులో చూడగా స్పృహ తప్పి పడిపోయిన చిన్నారిని గుర్తించి స్థానికులు బయటికి తీసారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.