నిర్మల్ (రైట్స్ మీడియా): బాసర గోదావరి బ్రిడ్జిపై బైక్ కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు... నిర్మల్ బాసర గోదావరి నది బ్రిడ్జి పైన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలానికి చెందిన నవీన్ యువకుడు హల్ చల్ చేశాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న వాగ్దేవి లేబర్ కాంట్రాక్ట్ సిబ్బంది,పోలీస్ సిబ్బంది గమనించారు.
బైక్ కొనివ్వాలని బాసర గోదావరి బ్రిడ్జిపై ఆత్మహత్య చేసుకుంటానని యువకుడి హల్చల్...
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..
తనకు బైక్ కొనివ్వాలని ఇంటిలో గొడవ పడి గోదావరి బసర్ బ్రిడ్జి పై నుండి దూకి చనిపోతానని అందరికి ఉరుకులు పరుగులు పెట్టించాడు. యువకుడిని బైకు కొనిస్తామని కుటుంబ సభ్యులు హామీ ఇవ్వడంతో అతని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పచెప్పారు. వాగ్దేవి లేబర్ కాంట్రాక్ట్ సిబ్బంది గణపతి, శ్రీనివాస్ మరియు బోటింగ్ సిబ్బంది గంగాధర్, నరేష్, సతీష్ మరియు పోలీస్ సిబ్బంది అందరు స్పందించి ఆ యువకునికి గోదావరి నది లో పడకుండా అతన్ని కాపాడారు.