Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
తెలంగాణ

గుంటూరుపల్లి గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ప్రజా సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు: మంత్రి పొన్నం ప్రభాకర్.

గుంటూరుపల్లి గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
Share Short Clip Download PDF

ఎల్కతుర్తి మండలం గుంటూరుపల్లి గ్రామంలో “పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో గ్రామంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజల నుంచి వ్యక్తిగత, సామాజిక సమస్యలపై వినతులు స్వీకరించి, సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.

గుంటూరుపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి నివేదిక

- గ్రామంలో 70 పెన్షన్లు మంజూరు కాగా, రూ.2.15 లక్షలు చెల్లింపు జరుగుతోంది.
- 3 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, నిర్మాణాలు పూర్తయ్యాయి. త్వరలో రెండో దశలో మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
- గృహజ్యోతి పథకం కింద 78 కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ రూ.6.12 లక్షలు ప్రభుత్వం భరిస్తోంది.
- మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ కింద 69 కుటుంబాలకు రూ.15.2 లక్షలు కేటాయించారు.
- 6 స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ.2.18 లక్షలు విడుదల చేశారు.
- మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.9.77 కోట్లు రుణాలు అందించారు.
- రైతు భరోసా కింద 296 కుటుంబాలకు రూ.24.23 లక్షలు విడుదల చేశారు.
- రైతు బీమా కింద ఇద్దరు రైతుల కుటుంబాలకు రూ.10 లక్షలు అందించారు.
- రైతు రుణమాఫీ కింద గ్రామానికి రూ.62.5 లక్షలు విడుదల చేశారు.
- భూ భారతి కింద 16 దరఖాస్తులు స్వీకరించారు.