Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

నల్లబెల్లి కేజీబీవీ పాఠశాలను సందర్శించిన తహసీల్దార్ ముప్పు కృష్ణ

నల్లబెల్లి కేజీబీవీ పాఠశాలను సందర్శించిన తహసీల్దార్ ముప్పు కృష్ణ
Share Short Clip Download PDF

నల్లబెల్లి(రైట్స్ మీడియా): కలెక్టర్ ఆదేశాల మేరకు నల్లబెల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) తహసీల్దార్ ముప్పు కృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా 9, 10, 11, 12వ తరగతుల విద్యార్థినుల కోసం నిర్వహించిన స్ఫూర్తి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థినులకు భవిష్యత్‌ విద్య, ఉద్యోగ అవకాశాలు, లక్ష్య సాధన తదితర అంశాలపై కెరీర్ గైడెన్స్, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు.
అనంతరం పాఠశాలలోని వివిధ రికార్డులను, పాఠశాల పరిసరాలను, మధ్యాహ్న భోజనాన్ని తహసీల్దార్ పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసి, పాఠశాల నిర్వహణకు సంబంధించి తగిన సూచనలు చేశారు.

ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు సన్మానం

9, 10వ తరగతుల్లో మంచి ప్రగతి సాధించిన విద్యార్థినులను సామాజికవేత్త బట్టు సాంబయ్య చేతుల మీదుగా సన్మానించారు. విద్యార్థినులను ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రంగాపురం హెచ్‌ఎం యాకూబ్ రెడ్డి, నల్లబెల్లి గ్రామ సర్పంచ్ జ్యోతి ప్రకాశ్, రంగాపురం మాజీ సర్పంచ్ చీకటి ప్రకాశ్ పాల్గొని విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. పాఠశాల స్పెషల్ ఆఫీసర్ ఆవుల సునీత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.

సెప్టెంబర్ 28న జరిగిన కుస్తీ పోటీల్లో కేజీబీవీ విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. SGFI అండర్-17 విభాగంలో మానస ఏ, అండర్-14 విభాగంలో డి. శ్రీవిద్యతో పాటు మరో విద్యార్థిని ఎంపికైనట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. కుస్తీ పోటీల్లో ఎంపికైన విద్యార్థినులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు సన్మానం