Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

కమలాపూర్‌లో ఎస్‌ఆర్ యూనివర్సిటీ మెగా కిసాన్ మేళా…

కమలాపూర్‌లో ఎస్‌ఆర్ యూనివర్సిటీ మెగా కిసాన్ మేళా…
Share Short Clip Download PDF

హనుమకొండ(రైట్స్ మీడియా): హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని రైతు వేదికలో ఎస్‌ఆర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెగా కిసాన్ మేళా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అల్లుడు, యువ నాయకుడు విష్ణు వర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రైతులకు ఉపయోగపడే జాన్ డీర్ నూతన మోడల్ ట్రాక్టర్‌ను ఆయన ప్రారంభించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతికత, వ్యవసాయ యంత్ర పరికరాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు.

ఎస్‌ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ విద్యార్థులు రైతులతో నేరుగా మాట్లాడి ఆధునిక సాగు పద్ధతులు, పంటల యాజమాన్యం, వ్యవసాయంలో సాంకేతికత వినియోగం తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

కమలాపూర్‌లో ఎస్‌ఆర్ యూనివర్సిటీ మెగా కిసాన్ మేళా…

ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, ఎస్‌ఆర్ యూనివర్సిటీ అధ్యాపకులు, వ్యవసాయ విద్యార్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

కమలాపూర్‌లో ఎస్‌ఆర్ యూనివర్సిటీ మెగా కిసాన్ మేళా…