సైదాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని, మృతి చెందిన వారి కుటుంబాలను హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ పరామర్శించారు. గుజ్జులపల్లిలో మాజీ సర్పంచ్ బొంకూరి కొమురయ్య సతీమణి రాజమ్మను, నల్ల రామయ్యపల్లిలో ప్రమాదంలో గాయపడిన పోలసాని లక్ష్మణరావును, కాలు ఆపరేషన్ చేయించుకున్న ఓల్సాని నర్సింహారావును పరామర్శించారు. బొమ్మకల్‌లో అనారోగ్యంతో ఉన్న వేముల నారాయణను కలసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పల్ల భాగ్య, ఏలూరి రాధ, చిట్టీ కిరణ్ కుమార్ రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య, మాజీ జెడ్పీటీసీ బిల్ల వెంకట్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్ రెడ్డి, సర్పంచులు తొంట రజనీకాంత్, మాచమల్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు అండగా వొడితల సతీష్ కుమార్
క్షతగాత్రులు, మృతుల కుటుంబాలకు పరామర్శ