వర్ధన్నపేట మండల సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులుగా వెంకట్రావుపల్లి గ్రామ సర్పంచ్ కుల్లా పావని యాకాంతంని ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు ప్రకటించినట్లు కాంగ్రెస్ మండలపార్టీ అధ్యక్షుడు పోశాల వెంకన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం ఛైర్మన్ కమ్మగొని ప్రభాకర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ , బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, నాయకులు మెరుగు రాజయ్య, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.