నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ ఓం గణేష్ మండలి వద్ద నేడు మధ్యాహ్నం నమయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధిలుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మరియు అదనపు కలెక్టర్ భుజంగా రావ్ పాల్గొన్నారు.
మొదట పూజా కార్యక్రమం అనంతరం పోలీస్ కమిషనర్ మరియు అదనపు కలెక్టర్ కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వచ్చిన వారికి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ అన్నదాన కార్య క్రమంలో పెద్ద మొత్తంలో స్నేహా సొసైటీ , గ్రేసీ ఆర్గనైజషన్ విధ్యార్దులు మరియు పోలీస్ సిబ్బంది, సామన్య ప్రజలు హజరయ్యారు.