Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
తెలంగాణ

ఎస్‌ఐఆర్‌లో అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు అందించి పకడ్బందీగా విచారణ చేపట్టాలి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి.

ఎస్‌ఐఆర్‌లో అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు అందించి పకడ్బందీగా విచారణ చేపట్టాలి
Share Short Clip Download PDF

ప్రతి ఓటరుకు నోటీసు అందేలా చర్యలు తీసుకోవాలి | విచారణ ప్రక్రియను పారదర్శకంగా,నిబంధనల ప్రకారం నిర్వహించాలి.

జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి.

ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో అనామలీస్, నో మ్యాపింగ్ కేటగిరీలో గుర్తించిన ప్రతి ఓటరుకు నోటీసులు అందించి, వారితో పకడ్బందీగా విచారణ నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.

సోమవారం హైదరాబాద్ నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసుల జారీ, పంపిణీ, విచారణ ప్రక్రియపై జిల్లాల వారీగా సమీక్షించారు.

కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ

అనామలీస్, నో మ్యాపింగ్ కేటగిరీలో గుర్తించిన ప్రతి ఓటరుకు నోటీసులు పంపిణీ చేయాలని సూచించారు. నోటీసులు అందించిన అనంతరం సంబంధిత ఓటర్లకు విచారణకు పూర్తి అవకాశం కల్పించి, వారి వివరాలను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.

విచారణ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రతి కేసుకు సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. నిర్ణీత గడువులోగా నోటీసుల పంపిణీ, విచారణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలోని ప్రతి వివరాన్ని నిశితంగా పరిశీలించి, అర్హులైన ఓటర్ల హక్కులను పరిరక్షిస్తూ, నిబంధనల ప్రకారం అనామలీస్, నో మ్యాపింగ్ అంశాలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ...

జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియలో నో మ్యాపింగ్, అనామాలీస్ జాబితాలోని ఓటర్లకు ఇప్పటివరకు సుమారు 75 శాతం నోటీసుల జారీ ప్రక్రియ పూర్తయిందని, విచారణలు కూడా సజావుగా కొనసాగుతున్నాయని తెలిపారు. దరఖాస్తుదారులు విచారణలకు హాజరు కాని సందర్భాల్లో మాత్రమే కొన్ని దరఖాస్తులు ల్యాప్స్‌ అవుతున్నాయని, మిగిలిన వాటికి సంబంధించి విచారణలను సకాలంలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విచారణకు హాజరు కాని వారికి రెండోసారి నోటీసులు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

పత్రాల అప్‌లోడ్‌ చేయడంపై ఏఈఆర్‌ఓలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించి, సంబంధిత అంశాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం పత్రాల అప్‌లోడ్‌లో ఎలాంటి సమస్యలు లేవని కలెక్టర్ తెలియజేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, హనుమకొండ ఆర్డీవో / వరంగల్ పశ్చిమ ఈఆర్ఓ వెంకటేష్, హనుమకొండ ఏఈఆర్ఓ రవీందర్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్‌లో అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు అందించి పకడ్బందీగా విచారణ చేపట్టాలి