సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ వైరా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ను కోరారు.

ఖమ్మం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్‌లో మంగళవారం జిల్లా కలెక్టర్ ను దివాకర టి.ఎస్ ను వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.

అభివృద్ధి పనులు, రైతుల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.