భారత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్న. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని విశ్వసించిన రాజీవ్ గాంధీ యువతకు ఎన్నో అవకాశాలను కల్పించారు. కేవలం 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి, దేశ ప్రజాస్వామ్య నిర్మాణంలో యువతకు కీలకమైన పాత్ర కల్పించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లాలనే దూరదృష్టితో ఆయన సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. నేడు మనం చూస్తున్న సమాచార సాంకేతిక, టెలికమ్యూనికేషన్ రంగాల అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు ఎంతో కీలకమైనవి. అదేవిధంగా గ్రామీణ భారత అభివృద్ధికి రాజీవ్ గాంధీ గారు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామ పంచాయతీలకు మరిన్ని అధికారాలు, నిధులు అందించడంతో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేశారు అని అన్నారు. 73వ, 74వ రాజ్యాంగ సవరణలకు ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రయత్నాలు స్థానిక సంస్థలకు ప్రజాస్వామ్య బలాన్ని చేకూర్చాయి అన్నారు.