వరదలతో అతలాకుతలమైన నేపాల్కు భారత్ మానవతా సహాయాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా నిన్న మరో రెండు విమానాల్లో 21.5 టన్నుల సహాయక సామగ్రిని తరలించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైద్య పరికరాలు, ఫోరెన్సిక్ కిట్లతో కూడిన ఈ అదనపు సహాయాన్ని స్థానిక ప్రభుత్వానికి నేపాల్లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ అందజేశారు. ఇప్పటివరకు మొత్తం 68 టన్నులకు పైగా అత్యవసర సహాయక సామగ్రిని, ప్రత్యేక రెస్క్యూ బృందాలను నేపాల్కు పంపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, టార్పాలిన్లు, సోలార్ లాంపులు, వాటర్ ప్యూరిఫికేషన్ ట్యాబ్లెట్లు, పోర్టబుల్ జనరేటర్లతో పాటు ఆహార పొట్లాలను ఈ సహాయంలో అందించారు.
నేపాల్ కు భారత్ సాయం..