జోధ్‌పూర్‌లో భారత్-జపాన్ సంయుక్త వైమానిక విన్యాసాలు 'వీర్ గార్డియన్ 2026' విజయవంతంగా ముగిశాయి. 14 రోజుల పాటు సాగిన ఈ విన్యాసాల్లో సుఖోయ్-30 ఎంకేఐ, రఫేల్, తేజస్, జపాన్ ఎఫ్-2ఏ యుద్ధ విమానాలు పాల్గొని సంక్లిష్ట విన్యాసాలు చేపట్టాయి. ఇరు దేశాల వ్యూహాత్మక రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ విన్యాసాలు దోహదపడ్డాయని రక్షణ శాఖ తెలిపింది.
భారత వైమానిక దళం, జపాన్ ఎయిర్ సెల్ఫ్-డిఫెన్స్ ఫోర్స్ సంయుక్తంగా చేపట్టిన ద్వైపాక్షిక వైమానిక విన్యాసాలు 'వీర్ గార్డియన్ 2026' జోధ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ముగిశాయి. రెండు దేశాల వైమానిక దళాల మధ్య పరస్పర సమన్వయం పెంపొందించడానికి, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ విన్యాసాలు కీలక వేదికగా నిలిచాయని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.