తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గరలపాలెం క్వారీ నుండి అక్రమంగా ఎర్రమట్టి తరలిపోతోంది. మైనింగ్ శాఖ అధికారులు ఈ కొండ నుండి రాయిని పగలగొట్టి కంకర తయారీకి మాత్రమే అనుమతి ఇచ్చారు. కానీ అనుమతులకు వ్యతిరేకంగా రోజూ 10 లారీలతో ఎర్రమట్టిని తవ్వి బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎర్రమట్టి తరలింపుకు ప్రత్యేక అనుమతి తీసుకోవాలి, రాయల్టీ చెల్లించాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా తరలింపు జరుగుతుండటంతో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లుతోంది.
ఈ మట్టిని కొత్తగా వేస్తున్న బీటీ రోడ్డుకి విరువైపులు వేయడానికి క్వారీ నుండి మట్టి తరలించడానికి రాయబారాలు జరిగాయని తెలుస్తుంది . దీనిపై సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.