Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
తెలంగాణ

రెండో విడత దళిత బంధు నిధులు వెంటనే మంజూరు చేయాలి

తెలంగాణ రక్షణ సేన నాయకుడు బండి అశోక్ కుమార్.

రెండో విడత దళిత బంధు నిధులు వెంటనే మంజూరు చేయాలి
Share Short Clip Download PDF

కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ రక్షణ సేన నాయకుడు బండి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నవల అర్పించారు. అనంతరం రెండవ విడత దళిత బందు రిలే దీక్షలు శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ...

రెండవ విడత దళిత బంధు నిధులను లబ్ధిదారులకు మంజూరు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామని ఆయన హెచ్చరించారు. హుజరాబాద్ నుండే దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా గత ప్రభుత్వం బిఆర్ఎస్ హుజురాబాద్ లోనే ప్రారంభించింది. నియోజకవర్గ లబ్ధిదారులకు మొండిచేయి చూపించారని ఆవేద వ్యక్తం చేశారు. దళిత బంధు అసలే రాని వాళ్ళకు కూడా దళిత బంధు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ తరుపున డిమాండ్ చేశారు. దళితుల ఓట్లతో ఎమ్మెల్యే గెలిచిన వారి కౌశిక్ రెడ్డి దళితుల పట్ల కపట ప్రేమ వలకబోస్తున్నారని అన్నారు. దళితులపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ప్రేమ ఉంటే వెంటనే దీక్ష వద్దకు వచ్చి, మాకు మద్దతుగా నిలవాలని కోరారు. హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ప్రెస్ మీట్ లో దళితులకు రెండో విడత అకౌంట్లో పడ్డ అమౌంటు ఎటు వెళ్లలేదని ప్రలోభాలు పలుకుతున్నారే తప్ప వాటిని ఎందుకు లబ్ధిదారులకు రిలీజ్ చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ దళితులను మోసం చేయడమే తప్ప వారికి న్యాయం చేసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే లబ్ధిదారులకు దళిత బంధు
విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు బుర్ర నటరాజ్,సురేష్, సంతోష్,సల్మా,రాజ్ కుమార్ తో పాటు సుమారు 200 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు.