హుస్నాబాద్ ఉమ్మాపూర్ లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల బాలుర, బాలికల హాస్టల్స్ నూతన భవనాలకు మంత్రి పోన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేసారు. ఒక్కో హాస్టల్ కి 7.28 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 14.56 కోట్ల రూపాయల వ్యయంతో హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ బాలుర & బాలికల హాస్టల్ కి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వీసీ ఉమేష్ కుమార్ , రిజిస్టార్ , ప్రిన్సిపల్ , కౌన్సిలర్ లు , మార్కెట్ కమిటీ చైర్మన్ లు , సర్పంచ్ లు తదితరులు పాల్గోన్నారు.
శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్స్ కు శంకుస్థాపన