నిజామాబాద్(రైట్స్ మీడియా): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పులాంగుకు చౌరస్తా కు సమీపంలోని పాటిగల్లిలో అకస్మాత్తుగా ఓ నివాసపు ఇల్లు ఒక్క సారిగా చెలరేగడంతో దగ్ధమైంది. గమనించిన స్థానికులు వెంటనే ఫైర్​ స్టేషన్​కు సమాచారం అందించారు. స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డట్టు తెలిసింది.. పూర్తి వివరాలను పోలీసులు,అగ్నిమాపక శాఖ అధికారులు సేకరిస్తున్నారు.