మహబూబాబాద్ (రైట్స్ మీడియా): ప్రభుత్వ నిబంధనలు సూచనల మేరకు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ గారి ఆదేశాల ప్రకారం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం తో పాటు ఇతర క్షేత్రస్థాయి ప్రభుత్వ, కాంటాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, ప్రభుత్వం నుండి జీతం తీసుకునే ప్రతి ఒక్కరు మీ ప్రమాణం యాప్ లో ఉద్యోగులు తమ వివరాలు నమోదు చేసుకుని ముఖచిత్రం హాజరు నమోదు ద్వారా హాజరు నమోదు చేయాలన్నారు.
అందులో భాగంగానే సాంకేతిక పరిజ్ఞానం తీసుకోవలసిన చర్యలు ఎలా యాప్ ను వినియోగించాలి, అనే అంశాలపై కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని, మళ్లీ ఒకసారి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు.
ఈ శిక్షణలో పాల్గొన్న సిబ్బందికి పలు సమస్యలు అంశాలపై సందేహాలను జిల్లా ఈ డిస్టిక్ మేనేజర్ యుగంధర్ సమాధానాలు ఇస్తూ యాప వినియోగం గురించి క్లుప్తంగా వివరించారు. ఈ శిక్షణ తరగతులలో కలెక్టరేట్ టెక్నికల్ సిబ్బంది కె.అశోక్, అన్ని విభాగాల సబ్ స్టాప్ పాల్గొన్నారు.