Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి

ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి
Share Short Clip Download PDF

మహబూబాబాద్ పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులు మరియు స్కానింగ్ సెంటర్లలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ ఆధ్వర్యంలో వైద్య బృందంతో కలిసి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో స్కానింగ్ యంత్రాలకు సంబంధించిన ఇన్వాయిస్ నంబర్లు, Form-F రికార్డులు మరియు ఇతర సంబంధిత రికార్డులను అధికారులు పరిశీలించారు. స్కానింగ్ సెంటర్లలో PCPNDT చట్టం నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశాలను కూడా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ,

లింగ నిర్ధారణ చేయడం, చేయించడం లేదా లింగ నిర్ధారణకు ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. PCPNDT చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైన సందర్భాల్లో సంబంధిత స్కానింగ్ సెంటర్/ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేటు ఆసుపత్రులు మరియు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు PCPNDT చట్టంలోని అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, లింగ నిర్ధారణకు సంబంధించిన ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడరాదని డాక్టర్ బి. రవి రాథోడ్ సూచించారు.

ఈ కార్యక్రమంలో పిఓఎంహెచ్ఎన్ డాక్టర్ విరాజిత, డాక్టర్ శివకుమార్, డిప్యూటీ డెమో రాజకుమార్, మనోహర్, ప్రశాంత్ పాల్గొన్నారు.