తెలంగాణ శాసనసభ మూడవ రోజు బుధవారం సమావేశమయింది. తాజాగా సభనుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసారు. సభ జరగనున్న అన్ని రోజులు ఈ సెషన్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్ తీర్మానాన్ని ఆమోదించి సస్పెండ్ చేసారు. 22A లాంటి ప్రజా సమస్యలు చర్చకు రాకుండా రేవంత్ సర్కార్ మరో కుట్రకు తెర లేపిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చకు భయపడి ఈ నిర్ణయం అని అన్నారు.