Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జాతీయం

దేశంలోని అన్ని జిల్లాల్లో AIPC కమిటీలను ఏర్పాటు చేస్తాం: మధుయాష్కిగౌడ్

పదవి గా కాకుండా బాధ్యతగా భావిస్తున్నాను...AIPC చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మధుయాష్కీ గౌడ్.

దేశంలోని అన్ని జిల్లాల్లో AIPC కమిటీలను ఏర్పాటు చేస్తాం: మధుయాష్కిగౌడ్
Share Short Clip Download PDF

• వీడియో కాల్ ద్వారా సందేశం అందించిన సామ్ పిట్రోడా.

ఢిల్లీ (రైట్స్ మీడియా): ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్ పర్సన్ గా మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ భవన్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా AIPC మాజీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి నుంచి మధుయాష్కి బాధ్యతలు స్వీకరించారు. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఏఐసీసీ ఇన్చార్జ్ రాజ్ పాల్ గౌతమ్, CWC మెంబర్స్ గురుదీప్ సింగ్ సప్పాల్, CWC సభ్యులు, రాజ్యసభ ఎంపీ దీపేందర్ హుడా, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మధుయాష్కి మాట్లాడుతూ..

ఏఐపీసీ చైర్మన్ గా నియమించడాన్ని పదవిగా చూడటం లేదని.. తన బాధ్యతగా భావించి పనిచేస్తానని వివరించారు. దేశవ్యాప్తంగా 50 వేల సభ్యత్వంతో.. అభివృద్ధి చెందిన 100 అర్బన్ జిల్లాల్లో AIPC కమిటీలను విస్తరించేలా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. అంబేద్కర్ సూచించిన బోధించు, సమీకరించు పోరాడు అనే సూత్రంతో AIPC ని నడిపిస్తానని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం మోడీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న తీరు, ప్రజాస్వామ్యం విలువలు మంట కలుపుతున్న తీరుకు వ్యతిరేకంగా ప్రొఫెషనల్స్ ను భాగస్వామ్యం పెంచేలా పనిచేస్తామన్నారు. రాహుల్ గాంధీ విజన్ కు అనుగుణంగా డెమొక్రటిక్ వాల్యూస్ ను దేశంలో పెంపొందించేందుకు ఏఐపీసీ తగిన పాత్ర పోషించేలా కృషి చేస్తామన్నారు.

రాహుల్ గాంధీ కోరుకుంటున్నట్లుగా భిన్నత్వంలో ఏకత్వం నకొనసాగుతూ.. దేశంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా, గౌరవప్రదమైన జీవనం సాగించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యమని, ఆ దిశగా పౌర సమాజం, ఏఐపీసీ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. మాజీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి దేశంలో ఆధార్ సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో నందన్ నిలేకని తో కలిసి పనిచేశారని గుర్తు చేశారు.

AIPC మొదటి చైర్మన్ శశిథరూర్, ఆ తర్వాత ప్రవీణ్ చక్రవర్తి సమర్థవంతంగా పని చేసి AIPC ని బలోపేతం చేశారని వివరించారు. పార్టీ పాలసీ నిర్మాణంలోనూ, దేశ అభ్యున్నతి కోసం రూపొందించే పాలసీలోనూ ప్రొఫెషనల్స్ పాత్రను పెంచుతామన్నారు.

ఈ సందర్భంగా మధుయాష్కి  మాట్లాడుతూ..

ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడుతూ..

ప్రొఫెషనల్స్ రాజకీయ రంగంలోకి రాకుండా దూరంగా ఉంటే.. దేశం ఉన్నతమైన విలువలతో అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు. ప్రొఫెషనల్ అనుభవం, ఆలోచనలు దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రొఫెషనల్స్ కు తగిన గుర్తింపు, గౌరవం ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లుగా మరే రాజకీయ పార్టీలోనూ లేదన్నారు. అర్బన్ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడే జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చిందని.. అర్బన్ ప్రాంతాలలోనే నివసించే ప్రొఫెషనల్స్ ను ఒక వేదికపై తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మధుయాష్కి గారు తనకు పాత మిత్రుడని.. అతను సమర్థవంతంగా పనిచేసి బలోపేతం చేస్తాడన్న నమ్మకం ఉందని వివరించారు.

ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడుతూ..

గురుదీప్ సింగ్ సప్పల్ మాట్లాడుతూ..

మోడీ ప్రభుత్వ హాయంలో కార్పొరేట్ల ఆదాయం నాలుగింతలు కాగా.. ఆ కార్పొరేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల జీతాలు మాత్రం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హాయంలో ప్రైవేటు సంస్థలు పనిచేసే ఉద్యోగులకు జీతాలు ప్రతి సంవత్సరం క్రమ పద్దతి లో పెరిగేవని.. కానీ మోడీ ప్రభుత్వ హాయంలో ఐటీ ఉద్యోగుల జీతాలు దశాబ్ద కాలంగా అంతే ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో దేశంలో అన్ని వర్గాలు సంక్షేమం సంతోషంగా ఉండాలని వివరించారు. మోడీ ప్రభుత్వ హాయంలో అన్ని వ్యవస్థలు నాశనం అవుతున్న తీరును అడ్డుకునే క్రమంలో ప్రొఫెషనల్ పాత్ర ఎంతో కీలకమన్నారు.

గురుదీప్ సింగ్ సప్పల్  మాట్లాడుతూ..

దీపిందర్ సింగ్ హుడా మాట్లాడుతూ..

అన్ని రకాల వనరులున్న మన దేశం.. సూపర్ శక్తిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని.. కానీ 12 ఏళ్ల మోడీ ప్రభుత్వమే హాయంలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ రంగాలతో పాటు వివిధ రంగాల్లోని వృత్తి నిపుణులను AIPC ద్వారా ఒక వేదికపై తీసుకురావాలని సూచించారు. ఉత్తర భారతదేశంలో ఏఐపీసీ ని మరింత విస్తరించాలని సూచించారు.

దీపిందర్ సింగ్ హుడా మాట్లాడుతూ..

ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ సామ్ పెట్రోడ మాట్లాడుతూ..

ఈ సందర్భంగా ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ సామ్ పెట్రోడ.. వీడియో కాల్ ద్వారా మధుయాష్కి కి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్రం అనంతరం దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే క్రమంలో నాటి ప్రధాని నెహ్రూ.. వివిధ రంగాల్లోని నిపుణులను గుర్తించి ప్రోత్సహించారని వివరించారు.

దేశంలో ఇండస్ట్రియల్, ఎయిర్, నేవీ, ట్రాన్స్పోర్ట్ హాస్పిటల్స్, రైల్వేస్, అగ్రికల్చర్ రంగాలను అభివృద్ధి చేసేందుకు నెహ్రూ ఎంతో శ్రమించారన్నారు. ప్రతి రంగంలోని డేటాను సేకరించడంలో, అందుకు అనుగుణంగా దేశంలో అభివృద్ధిని, నూతన ప్రణాళికను రచించడానికి ప్రొఫెషనల్స్ ఎంతో అవసరం అన్నారు. దేశంలోని అన్ని జిల్లాల్లోనూ ఏఐపిసి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.

అందులో డాక్టర్స్, టీచర్స్, సైంటిస్ట్ ఇంజనీర్స్ ఇలా అన్ని రంగాల నిపుణులను భాగస్వామ్యం చేయాలన్నారు. దేశ నిర్మాణంలో ప్రొఫెషనల్స్ ను కీలక భాగస్వామ్యం చేయాలని సూచించారు.

రాజుపాల్ గౌతమ్ మాట్లాడుతూ..

స్వాతంత్ర పోరాటంలో లక్షలాదిమంది పాల్గొని తమ జీవితాలను త్యాగం చేశారని, అ త్యాగాల చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు. అనేక సంస్కృతులకు నిలయమైన భారతదేశంలో నేడు విభజన రాజకీయాలతో ప్రజాస్వామ్య రాజ్యాంగ హక్కులు ప్రమాదంలో పడ్డాయన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే సహకారంతో మొదటి మహిళా పాఠశాల పూణేలో నెలకొల్ప బడిందని.. తొలి దళిత పాఠశాల కూడా అక్కడే ప్రారంభమైందన్నారు. దేశంలో అన్ని వర్గాల వారికి చదువు, అవకాశాల పాటు వ్యాపార వాణిజ్య రంగాల్లోనూ ప్రోత్సహించిన చరిత్ర కాంగ్రె స్ దన్నారు. కానీ మోడీ ప్రభుత్వం కొందరి కార్పొరేట్లనే ప్రోత్సహిస్తుందని విమర్శించారు. అన్ని రంగాల్లోని డేటాను సేకరించి.. సమాజ అభివృద్ధికి సరైన మార్గ నిర్దేశనం ఏఐపీసీ చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా నూతనంగా రూపొందించిన AIPC పాటను దీపా దాస్ మున్షీ విడుదల చేశారు..