Friday, 25 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
క్రైమ్ న్యూస్

వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పరిధిలో దారుణ ఘటన?

• మృతదేహం కంటిని ఎలుకలు కొరికినట్లు ఆరోపణలు..

వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పరిధిలో దారుణ ఘటన?
Share Short Clip Download PDF

వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మార్చురీ (పోస్టుమార్టం గది) లో భద్రపరిచిన మృతదేహం కంటిని ఎలుకలు కొరికినట్లు ఓ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే..

రాయపర్తి మండలానికి చెందిన వీరయ్య శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురికి తరలించారు. రాత్రి కావడంతో పోస్టుమార్టం గదిలోనే మృతదేహాన్ని భద్రపరిచారు. ఉదయం కుటుంబ సభ్యులు చూడగా మృతదేహం కళ్ళ భాగంలో ఎలుకలు కొరికినట్లు గాయాలు కనిపించాయి.
దీంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వసతులు లేవని, మార్చురీ నిర్వహణ అధ్వానంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన తర్వాత కూడా శవానికి రక్షణ లేకుండా పోయింది. ఎలుకలు కొరికే స్థితిలో మార్చురీ ఉంటే ఎలా? ఇది అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరణ:

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఈ ఘటనపై ఫోన్ లో వివరణ కోరగా మృతదేహం మార్చురిలో ఉన్నప్పుడు నాకు విషయం తెలియదు మృతదేహం వెళ్లిన తర్వాత తెలిసింది. ఇట్టి విషయంపై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటాను. మార్చురీ గది ఆసుపత్రికి కిలోమీటర్ దూరంలో ఉండటం, మరీ ముఖ్యంగా అక్కడ విద్యుత్ సౌకర్యం కూడా లేదు. త్వరలో విద్యుత్ సౌకర్యం కల్పించి, మృతదేహాలకు రక్షణ కల్పించడానికి కృషి చేస్తానని తెలిపారు.