డీఐపీసీ సమావేశంలో మొత్తం 22 యూనిట్లకు వివిధ పారిశ్రామిక ప్రోత్సాహకాల క్రింద రూ. 2,58,18,743 మంజూరుకు ఆమోదం లభించింది.
పెట్టుబడి సబ్సిడీ క్రింద ఎస్టీ కేటగిరీకి చెందిన 8 యూనిట్లకు రూ.1,83,27,581, ఎస్సీ కేటగిరీకి చెందిన 8 యూనిట్లకు రూ. 69,13,112, ఓసీ కేటగిరీకి చెందిన 2 యూనిట్లకు రూ. 2,72,232 ప్రోత్సాహకాలకు ఆమోదం తెలిపారు.
వడ్డీ క్రింద ఎస్టీ కేటగిరీకి చెందిన 2 యూనిట్లకు రూ.1,21,509, పవర్ కాస్ట్ క్రింద ఓసీ కేటగిరీకి చెందిన 2 యూనిట్లకు రూ.1,84,309 ప్రోత్సాహకాలకు ఆమోదం లభించింది.
పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను అర్హులైన పారిశ్రామికవేత్తలకు సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పరిశ్రమల అనుమతుల ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహిస్తూ పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జీఎం ఇండస్ట్రీస్ ప్రవీణ్ కుమార్, ఎల్డీఎం రవి ప్రసాద్, ఆర్టీఓ శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముజాహిద్, ఇండస్ట్రీస్ ఏడి నకుల్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.