తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17న నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
వరంగల్ కలెక్టరేట్ లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
⏩జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డా. సత్య శారద.
News URL: https://rightsmedia.in/news/praja-palana-day-celebrated-grandly-at-warangal-collectorate
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
ప్రజాపాలన దినోత్సవం యొక్క ప్రాధాన్యతను వివరించారు. ప్రజలకు మెరుగైన, పారదర్శక సేవలు అందించాలని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు చేరవేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్. కిషోర్ కుమార్, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) వై.వి. గణేష్, డీఆర్వో విజయలక్ష్మి, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.