తెలంగాణ పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని ట్రెజరీలో కాకుండా వాటి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకొనే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. ఇకపై గ్రామసభ తీర్మానంతో నిధులను వాడుకోవచ్చు. ప్రస్తుతం ట్రెజరీలో జమ చేశాక వాటిని డ్రా చేయడానికి అనేక ఇబ్బందులొస్తున్నాయి. పంచాయతీలకు వచ్చే ఆదాయం గ్రామాల అభివృద్ధికే ఉపయోగపడాలని మంత్రి సీతక్క చెప్పారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
తెలంగాణ
గ్రామ పంచాయతీలకు శుభవార్త
News URL: https://rightsmedia.in/news/good-news-for-gram-panchayats