RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
క్రైమ్ న్యూస్
హెచ్ఐవి తో బాధపడుతున్న మహిళను అడవిలో వదిలేసిన కుటుంబం
News URL: https://rightsmedia.in/news/family-abandons-hiv-positive-woman-in-the-forest
జిల్లాలో మానవత్వాన్ని మరిచిపోయిన ఘటన చోటుచేసుకుంది. హెచ్ఐవి తో బాధపడుతున్న ఒక మహిళను ఆమె కుటుంబసభ్యులు అడవిలో వదిలి వెళ్లిపోయారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు. అనంతరం, ఆ మహిళను మహాదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు. 112 ద్వారా పోలీసులకు సమాచారం అందించినప్పటికీ నిర్లక్ష్యం వహించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తున్నామని చెప్పి కుటుంబసభ్యులు ఆ మహిళను అడవిలో వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది.