మహబూబాబాద్ జిల్లాలో CMR బియ్యం డెలివరీలో డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లపై ప్రభుత్వం మరియు పౌర సరఫరాల శాఖ కమీషనర్ ఆదేశాల మేరకు కఠిన చర్యలు పడుతున్నట్లు అదనపు కలెక్టర్ (సివిల్ సప్లైస్) & ఎక్స్-అఫీషియో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మహబూబాబాద్ తెలిపారు.
జిల్లాలో ఇప్పటివరకు మొత్తం ఐదు రైస్ మిల్లులపై కేసులు నమోదు కాగా, తెలంగాణ ప్రభుత్వం – పౌర సరఫరాల శాఖ ప్రత్యేకంగా చేపట్టిన “మిషన్ K-100” కార్యక్రమంలో భాగంగా మరో మూడు డిఫాల్ట్ రైస్ మిల్లులపై కేసులు నమోదు చేసి, డిఫాల్ట్ అయిన మొత్తాన్ని మిల్లర్ల వద్ద నుండి రికవరీ చేయడం జరిగింది.
మిషన్ K-100 కార్యక్రమంలో భాగంగా శ్రీ తిరుమల బిన్నీ రైస్ మిల్లు , కేసముద్రం మరియు శ్రీ బాలాజీ ఆగ్రో ఇండస్ట్రీస్, కేసముద్రం తదితర డిఫాల్ట్ రైస్ మిల్లులపై కేసులు నమోదు చేసి, ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను రికవరీ చేయడం జరిగింది.
ధనలక్ష్మి ఇండస్ట్రీస్‌పై కేసు నమోదు
మహబూబాబాద్ జిల్లాలోని వెంగంపేటకు చెందిన ధనలక్ష్మి ఇండస్ట్రీస్ రైస్ మిల్లు ఖరీఫ్ 2023-24 సీజన్‌కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) డెలివరీలో డిఫాల్ట్ అయినట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వానికి చెల్లించాల్సిన CMR బకాయిలను సకాలంలో చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచినట్లు గుర్తించబడింది. సంబంధిత రైస్ మిల్లర్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఆదేశించినప్పటికీ, ఇప్పటివరకు బకాయిలను చెల్లించకపోవడంతో ధనలక్ష్మి ఇండస్ట్రీస్‌పై సంబంధిత చట్ట ప్రకారం కేసు నమోదు చేయబడింది.
ప్రభుత్వ ధాన్యం, CMR బియ్యం డెలివరీ మరియు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిల విషయంలో ఎటువంటి డిఫాల్ట్‌లు లేదా అవకతవకలను ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు.
నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాలను చెల్లించని రైస్ మిల్లర్లపై చట్టపరమైన చర్యలతో పాటు, ప్రభుత్వ బకాయిల రికవరీ కోసం కఠిన చర్యలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.