హనుమకొండ(రైట్స్ మీడియా): భద్రకాళి చెరువు వరద నీటి అవుట్ ఫాల్ రెగ్యులేటర్ పనులను వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండలోని కాపువాడలో భద్రకాళి చెరువు కట్ట వద్ద చేపట్టిన నాలా విస్తరణ పనులను, భూ సేకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మిగిలి ఉన్న భూ సేకరణ ప్రక్రియను, నాలా విస్తరణ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
భద్రకాళి చెరువు అవుట్ ఫాల్ రెగ్యులేటర్ పనులను వేగవంతం చేయాలి
⏩హనుమకొండలోని కాపువాడలో నాలా విస్తరణ పనులను పరిశీలించిన హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
News URL: https://rightsmedia.in/news/work-on-the-bhadrakali-lake-outfall-regulator-needs-to-be-expedited
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ
నాలా విస్తరణకు సంబంధించిన చేపట్టిన పనులను వేగవంతం చేయడంతో పాటు మిగిలి ఉన్న భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా హనుమకొండ ఆర్డీవో వెంకటేశ్, మున్సిపల్ ఎస్ఈ రాజ్ కుమార్, ఇరిగేషన్ ఎస్ఈ రాంప్రసాద్, ఈఈ రవికుమార్, సీపీ రవీంద్ర రెడేకర్, ఈఈ కిరణ్ కుమార్, డీఈ మధుసూదన్ రెడ్డి, తహసిల్దార్ రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.