కాకతీయ విశ్వవిద్యాలయానికి వచ్చే దివ్యాంగ ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర సంబంధిత అభ్యర్థుల సౌకర్యార్థం పరిపాలన భవన ప్రాంగణంలో రెండు వీల్చైర్లను అందుబాటులో ఉంచినట్లు విశ్వవిద్యాలయ దివ్యాంగుల సెల్ సంచాలకులు డాక్టర్ ఎ. రాజు ఒక ప్రకటనలో తెలిపారు. వీల్చైర్లను విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి అందజేశారు.
ఈ కార్యక్రమం లో రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, పాలక మండలి సభ్యులు డాక్టర్ చిర్రా రాజు పాల్గొన్నారు. దివ్యాంగుల సౌకర్యార్థం వీటిని అందుబాటులో ఉంచడం అభినందనీయమని అన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
దివ్యాంగుల సౌకర్యార్థం వీల్చైర్లు అందజేత
News URL: https://rightsmedia.in/news/wheelchairs-provided-for-the-convenience-of-persons-with-disabilities