కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలను విస్మరించి, ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించింది. కాంగ్రెస్ పార్టీ పాలనా వైఫల్యాలపై బి.ఆర్.ఎస్. పార్టీ తెలంగాణ వ్యాప్తంగా వారం రోజుల పాటు నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
కాంగ్రెస్ మోసాలను ఎండగడతాం
ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ హాసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు బండి రజనీ కుమార్ హెచ్చరిక.
News URL: https://rightsmedia.in/news/we-will-expose-the-congress-s-frauds
ఈ సంధర్బంగా హాసన్పర్తి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండి రజనీ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని, గ్రామాలు, మండలాల్లో వినూత్న కార్యక్రమాలతో ప్రభుత్వ మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. ఈ నిరసనల్లో మండల, డివిజన్ స్థాయి నేతలు, మహిళా ప్రజాప్రతినిధులు, రైతులు, యువత మరియు సోషల్ మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా రైతు బంధు సమితి కన్వీనర్ సంగాల విక్టరీబాబు, డివిజన్ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.