తెలంగాణ వైతాళికుడు, ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి (తెలంగాణ భాషా దినోత్సవం) వేడుకలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి శిక్షణా సహాయ కలెక్టర్ పారస్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
కాళోజీ అడుగుజాడల్లో నడవాలి: శిక్షణా సహాయ కలెక్టర్ పారస్ కుమార్
ఘనంగా ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు
News URL: https://rightsmedia.in/news/we-must-follow-in-kaloji-s-footsteps-trainee-assistant-collector-paras-kumar
ఈ సందర్భంగా పారస్ కుమార్ మాట్లాడుతూ,
సమాజంలోని అన్యాయాలను, అక్రమాలను తన కలం బలం ద్వారా ఎండగట్టిన మహోన్నత వ్యక్తి కాళోజీ అని కొనియాడారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతి పరిరక్షణకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజాచైతన్యమే ఊపిరిగా జీవించిన కాళోజీ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని, ఆయన చూపిన బాటలో, అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, కేర్ టేకర్ వెంకన్న, సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని కాళోజీ నారాయణరావు సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.