వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో విస్తృతంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఎయిర్పోర్ట్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్డు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్ తరహాలోనే వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, టెంపుల్, ఫారెస్ట్ టూరిజం, వరంగల్ ఎయిర్పోర్ట్ రోడ్ కనెక్టివిటీ, బస్ టెర్మినల్, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు.